VIDEO: యాదాద్రిలో పెరిగిన భక్తుల రద్దీ

BNR: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి వేసవి సెలవులు శనివారం భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొండకింద కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కొండపైకి చేరుకొని ఇష్టదైవాలను దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి 2గంటలకు పైగా సమయం పడుతోంది.