VIDEO: కోడూరులో ప్రమాదకరంగా ఆవులు

VIDEO: కోడూరులో ప్రమాదకరంగా ఆవులు

అన్నమయ్య: రైల్వే కోడూరు పట్టణంలోని మహాత్మా గాంధీ రోడ్డులో ఆవులు ప్రమాదకరంగా తిరుగుతున్నాయి. యజమానులు పాలు పిండుకొని వాటిని రోడ్లపై వదిలేయడంతో, ఆవులు రోడ్లపైనే ప్లాస్టిక్, కాగితాలు తింటూ కాలక్షేపం చేస్తున్నాయి. పంచాయతీ అధికారులు ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో రాత్రిపూట వాహన చోదకులకు, ప్రజలకు ఆవుల వల్ల ప్రాణహాని ఏర్పడుతోంది.