తెనాలిలో భగత్ సింగ్ జయంతి వేడుకులు
GNTR: తెనాలి పట్టణంలోని శివాజీచౌక్‌లో సర్దార్ భగత్ సింగ్ విగ్రహం వద్ద ఏఐఎస్ఎఫ్ నాయకులు శనివారం నివాళిలర్పించారు. ఆయన జయంతి సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు జోహార్ భగత్ సింగ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసి 23 ఏళ్ల వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన మహా వీరుడు సర్దార్ భగత్ సింగ్ అని కొనియాడారు.