మాజీ సర్పంచ్ మృతి.. నివాళులర్పించిన ఎమ్మెల్యే
AKP: పరవాడ మండలం దేశపాత్రునిపాలెం మాజీ సర్పంచ్ ఏ.జోగి నాయుడు శుక్రవారం మృతి చెందారు. భౌతికకాయంపై పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి సానుభూతి తెలియజేసి ఓదార్చారు. నివాళులు అర్పించిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు కరణం నర్సింగరావు, స్థానిక నాయకులు శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.