ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్టగొడుగులకు మంచి డిమాండ్

ఏజెన్సీ ప్రాంతాల్లో పుట్టగొడుగులకు మంచి డిమాండ్

MLG: ఏజెన్సీలో పుట్టగొడుగులకు మంచి డిమాండ్ ఉంది. వర్షాకాలంలో సహజసిద్ధంగా అడవి ప్రాంతాల్లోని కొండాయి, గంటలకుంట, దొడ్ల, గుర్రాలబావి, చింతలమోరి గుత్తికోయల గూడాల్లో వీటిని సేకరించి విక్రయిస్తుంటారు. ఎన్నో పోషక విలువలు కలిగిన వీటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు ఎగబడుతుంటారు. ఆదివారం కొంతమంది గుత్తికోయలు ఒక కట్ట ధర రూ.50, రూ.100కు విక్రయించారు.