వికలాంగుల పెన్షన్ రద్దు చేయొద్దు: సీపీఎం

KRNL: ఆదోనిలో సీపీఎం నాయకులు గోపాల్ ఆధ్వర్యంలో వికలాంగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్, మల్లయ్యతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించి, కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. వికలాంగుల పెన్షన్ రద్దును వెంటనే నిలిపివేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. పెన్షన్ రద్దుతో వికలాంగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అర్హులైన వారికీ పింఛన్ అందించాలని కోరారు.