దాడులకు పాల్పడితే బదులిస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

దాడులకు పాల్పడితే బదులిస్తాం: పాక్ ఆర్మీ చీఫ్

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రాంతీయ శాంతిని కోరుకుంటుందని, అయితే తనను తాను రక్షించుకోవడానికి దాడులకు ఏ మాత్రం వెనుకాడబోదని స్పష్టం చేశారు. భారత్ చేసే ఏ సైనిక చర్యకైనా వేగంగా ప్రతిస్పందిస్తామన్నారు. దాడులకు దీటుగా బదులిస్తామన్నారు. జాతీయ ప్రయోజనాలకు కాపాడుకోవడానికి సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు.