కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు
SDPT: హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జన్ గౌడ్ ఆదేశాల మేరకు పట్టణంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. పలు కాలనీలలో నిండుకున్న డ్రైనేజీలు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేశారు. ప్రధాన రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించారు.