ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి: MJS

ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి: MJS

KMR: ఈనెల 26న సిద్దిపేటలో జరిగే మాదిగ ఉద్యోగ జాగృతి ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని మాదిగ జాగృతి సంఘ నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం MJS జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, రిటైర్డ్ మాదిగ ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ మాదిగ ఉద్యోగ జాగృతి ఆవిర్భవించిందన్నారు.