సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యం

MNCL: సింగరేణి సంస్థలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి భవిష్యత్ ప్రమాదంలో ఉందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ 3 గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్‌లో మాట్లాడుతూ.. సింగరేణికి గత బీఆర్ఎస్ సర్కార్ రూ.27 వేల కోట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.15 వేల కోట్లు బకాయి పడిందని తెలిపారు.