అన్నమరాజుపేటలో విద్యుత్ స్తంభాల ఏర్పాటు

విజయనగరం: జామి మండలం అన్నమరాజుపేటలో విద్యుత్ శాఖ ఏఈ జ్యోతిశ్వర్రావు ఆదేశాల మేరకు ప్రమాదకరంగా, వేలాడుతున్న విద్యుత్ లైన్లను గుర్తించారు. శనివారం లైన్మెన్ వెంకటేశ్ ఆధ్వర్యంలో నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటును చేపట్టారు. నేటితో సమస్య తీరడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.