దేశంలో ఉగ్రదాడులకు కుట్ర.. HYD వాసి అరెస్ట్

దేశంలో ఉగ్రదాడులకు కుట్ర.. HYD వాసి అరెస్ట్

దేశంలో ఉగ్రదాడులకు చేసిన కుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు భగ్నం చేశారు. ఈ క్రమంలోనే దాడులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. గతేడాది నుంచి వారిపై నిఘా ఉంచినట్లు చెప్పారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేయాలని వారు ప్లాన్ చేసినట్లు తెలిపారు. వారిలో HYDకు చెందిన సయ్యద్ అహ్మద్ మొయిద్దీన్ ఉన్నాడు.