రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
WNP: పానగల్ మండలంలోని కేతేపల్లి-తెల్లరాళ్లపల్లి మధ్య బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు కొల్లాపూర్ నుంచి వనపర్తికి పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. స్థానికులు అంబులెన్సుకు సమాచారం అందించగా, ఈఎంటీ విష్ణు వారిని చికిత్స నిమిత్తం కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.