నేడు 76 రైళ్ల దారి మళ్లింపు

నేడు 76 రైళ్ల దారి మళ్లింపు

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో సుమారు 76 రైళ్లను మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ మేరకు చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ, నాంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. అభివృద్ధి పనుల దృష్ట్యా 10వ నెంబర్ ప్లాట్‌ఫారం నుంచి 7వ నెంబర్ ప్లాట్‌ఫారం వరకు మూసివేశారు. ప్రయాణికులు గమనించాలన్నారు.