VIDEO: చంద్రబాబు నాయుడుకి అర్చకుల వేద ఆశీర్వచనం
NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానంలో చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో శీనా నాయక్ ఆధ్వర్యంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం సీఎం దంపతులకు శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఆయురారోగ్యాలతో రాష్ట్రానికి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.