బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి: రామచంద్రారెడ్డి

బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలి: రామచంద్రారెడ్డి

GDWL: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం అయిజలో ఆయన స్వగృహం ఎదుట జెండా ఎగురవేశారు. బీజేపీకి 46 ఏళ్ల చరిత్ర ఉందని దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ నరసింహ పాల్గొన్నారు.