జిల్లాలో చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా..!
KMR: జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మాంసం ధరలు నిలకడగా ఉన్నట్లు వ్యాపారులు తెలిపారు. మటన్ కిలో రూ. 800 పలుకుతుండగా, చికెన్ కిలో రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక స్కిన్ లెస్ చికెన్ కిలో రూ. 150 వద్ద ఉంది. గత వారం నమోదైన ధరలే ఈ వారం కూడా కొనసాగుతున్నాయని, మాంసపు విక్రయాలు సాధారణంగా ఉన్నాయని వ్యాపారులు పేర్కొన్నారు.