ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలి

ELR: ఏలూరు రూరల్ మండలం పాలగుడెం గ్రామంలో అసంఘటిత కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ శ్రామికులకు కనీస సౌకర్యాలను ఏర్పాటు చేయాలని త్రాగునీరు, వైద్య సదుపాయం మొదలైనవి అందుబాటులో ఉంచాలన్నారు. కార్మికుల పిల్లలకు చదువులు నేర్పించాలన్నారు.