VIDEO: గాలివాన బీభత్సం – కుప్పకూలిన విద్యుత్ స్తంభాలు
MHBD: కొత్తగూడ మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులతో బీభత్సం సృష్టించింది. మండలంలోని ఓటాయి గ్రామంలో ఈదురు గాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకూలాయి. స్తంభాలు కూలిపోవడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు అప్రమత్తమై పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.