VIDEO: పసలపూడిలో మితిమీరుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు

VIDEO: పసలపూడిలో మితిమీరుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు

కోనసీమ: రాయవరం మండలం పసలపూడిలో గంజాయి బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దీంతో గ్రామస్థులు శనివారం పోలీసులను ఆశ్రయించారు. రాత్రి సమయంలో యువకులు గుంపుగా చేరి, బహిరంగంగా గంజాయి సేవిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు బయట తిరగాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.