సింహాద్రి అప్పన్న సేవలో గౌతమ్ గంభీర్

సింహాద్రి అప్పన్న సేవలో గౌతమ్ గంభీర్

VSP: సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని భారత్ క్రికెట్ కోచ్ గౌతమ్ గంభీర్ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. గంభీర్‌కు ఆలయ ఏఈ ఓ తిరుమలేశ్వర్రావ్, అధికారులు స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వాదంతో పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. గంభీర్‌ను చూసేందుకు క్రికెట్ అభిమానులు పోటీపడ్డారు.