VIDEO: వడగళ్లతో కూడిన భారీ వర్షం

VIDEO: వడగళ్లతో కూడిన భారీ వర్షం

ASR: పాడేరు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. ఈక్రమంలో డోకులూరు గ్రామంలో వర్షంతో పాటు పెద్ద ఎత్తున వడగళ్ల వాన కురిసింది. వడగళ్లు ఎక్కువగా పడి పేరుకుపోయి కనిపించాయి. వర్షం కురుస్తున్న సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, చెట్ల కింద ఉండకూడదని అధికారులు ప్రజలకు సూచించారు.