'రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై అవగాహన కల్పించాలి'
VZM : MSME శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాల అమలుపై అధికారులతో అమరావతి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వివిధ దేశాల్లో కీలక స్థానాల్లో ఉన్న తెలుగు NRIలతో ప్రత్యేక క్లబ్ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పారిశ్రామిక విధానం వివరించి పెట్టుబడులపై అవగాహన కల్పించాలన్నారు.