రానున్న మూడు రోజుల్లో వర్షాలు

ప్రకాశం: పొన్నలూరు మండలంలో రానున్న మూడు రోజులలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడనున్నట్లు APSDMA వారు తెలిపారని తహసీల్దార్ పుల్లారావు అన్నారు. పొన్నలూరుతో పాటు నియోజకవర్గంలోని కొండపి, మర్రిపూడి, జరుగుమల్లి, టంగుటూరు తోపాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.