'అర్జీల వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు చేయండి'
PPM: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు సంబంధించిన అర్జీల వివరాలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. అర్జీల స్థితిని తెలుసుకోవడానికి 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చని చెప్పారు. సోమవారం అన్ని కార్యాలయాల్లో ప్రజల వినతులు స్వీకరించబడతాయని పేర్కొన్నారు.