కోటగుళ్లలో ఫ్రాన్స్ దేశస్థుల సందడి
BHPL: కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో మంగళవారం ఫ్రాన్స్ దేశస్థులు సందడి చేశారు. ఫ్రాన్స్‌కు చెందిన ఎరిఫ్, ఎలిక్లు ఆలయాన్ని సందర్శించారు. మొదట స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ పరిసరాలు అందాలను వీడియోల రూపంలో బంధించారు. కోటగుళ్ల చరిత్రను ఆలయార్చకులు జూలపల్లి నాగరాజును వారు అడిగి తెలుసుకున్నారు.