VIDEO: 'డ్రైవింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి'
ASR: గిరిజన యువతీ యువకులు సఖి డ్రైవింగ్ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని జిల్లా రవాణా శాఖ అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సాయి రమేశ్ సూచించారు. బుధవారం అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించి, అక్కడ జరుగుతున్న డ్రైవింగ్ శిక్షణ పరిశీలించారు. అనంతరం యువతతో మాట్లాడారు.