నల్లజర్ల మండలంలో రోడ్డు ప్రమాదం
E.G: నల్లజర్ల మండలం ఘంటవారిగూడెం-లక్ష్మీనగర్ మధ్య గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రాంగ్ రూట్‌లో వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు