సత్తెనపల్లిలో న్యాయవాదుల నిరసన

PLD: సత్తెనపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంగూరి అజయ్ కుమార్ పిలుపుతో న్యాయవాదులు సత్తెనపల్లిలోని నాలుగు న్యాయస్థానాల్లో గురువారం విధులు బహిష్కరించారు. తాలుకా న్యాయస్థానం ప్రాంగణంలో ఉన్న న్యాయదేవత విగ్రహం వద్ద న్యాయవాదులు సమీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై న్యాయవాదులను రక్షించే చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.