రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు గాయాలు

రోడ్డు ప్రమాదం.. వ్యక్తులకు గాయాలు

GNTR: కొల్లిపర మండలం వల్లభాపురం వంతెన వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న అంబులెన్స్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలవ్వగా స్థానికులు వెంటనే కొల్లిపర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇందులో బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.