'అర్జీలను స్వీకరించిన మంత్రి లోకేష్'

GNTR: మంత్రి నారా లోకేష్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ప్రజలను నేరుగా కలిసి వారి నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. స్వయంగా మంత్రి లోకేష్ సమస్యలను విని పరిష్కారానికి భరోసా ఇవ్వడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.