బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులకు డీఎస్పీ సన్మానం
JGL: మెట్‌పల్లి పట్టణానికి చెందిన నలుగురు విద్యార్థులు, జపాన్ కరాటే అసోసియేషన్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన శిక్షకులు రాపోలు సుదర్శన్ మాస్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్ బెల్ట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, బ్లాక్ బెల్టు పొందారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాములు, జిల్లా కరాటే శిక్షకులు విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు.