ఏటేటా పెరుగుతున్న ఉత్తీర్ణత

ఏటేటా పెరుగుతున్న ఉత్తీర్ణత

గుంటూరు: ఇంటర్ ఫలితాల్లో జిల్లా అద్భుత ప్రగతి సాధిస్తోంది. 2009లో ఫస్టియర్ 50.76 శాతం, సెకండియర్ 65.14 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. నాటి నుంచి ఏటేటా పాస్ శాతం క్రమంగా పెరుగుతోంది. 2021లో కరోనాతో అందరూ పాసయ్యారు. 2024లో ఫస్టియర్ 81%, సెకండియర్ 87% పాసవ్వగా.. 2025లో 82%, 91% మంది గట్టెక్కారు. తాజాగా 2026లో ఫస్ట్, సెకండ్ ఇయర్స్‌లో 88 శాతం సాధించారు.