కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌లో నిమగ్నం: ఎంపీ

KMM: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 21 నెలలుగా డైవర్షన్ పాలిటిక్స్‌లో నిమగ్నమై ఉందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. వాషింగ్టన్ డీసీలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బీఆర్ఎస్‌కు లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండగట్టే కుట్రలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నారని విమర్శించారు.