నేడు కందుకూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు కందుకూరులో విద్యుత్ సరఫరాకు అంతరాయం

నెల్లూరు: కందుకూరు పట్టణంలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓవిరోడ్డులో లైన్ వర్క్ ఉన్నందువలన ఉదయం 9:15 నుంచి సాయంత్రం 04:00 గంటల వరకు 11 కేవీ సీటీఆర్ఐ ఫీడర్ నందు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.