దేవుడి పేరుతో దందాలు చేశారు: ఎమ్మెల్యే బొండా

కృష్ణా: గత ప్రభుత్వ పాలనలో దేవుడి పేరుతో దందాలు చేశారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ ట్వీట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఒకేసారి 54 మందిని తిరుమల శ్రీవారి దర్శనానికి పంపించాలని రాసిన సిఫారసు లేఖతో ఈ దందా బైటపడిందన్నారు. భక్తుల సౌకర్యాల గురించి ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు.