నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

NLG: కేతేపల్లి మండలం భీమవరం గ్రామానికి చెందిన చీముట వెంకటయ్య శుక్రవారం అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శనివారం గ్రామానికి చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ బడుగుల లింగయ్య మాజీ మార్కెట్ చైర్మన్ ప్రదీప్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.