బార్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్

NLR: జిల్లా బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ఖరారు అయినట్లు అధికారులు వెల్లడించారు. మే 20వ తేదీన నామినేషన్ స్వీకరణ ప్రారంభమై ఈనెల 26వ తేదీన ముగుస్తుందని తెలిపారు. 27వ తేదీన నామినేషన్ల పరిశీలన 30న ఉపసంహరణ ప్రక్రియ జరుగుతుందన్నారు. జూన్ 20న ఓటింగ్ అలాగే ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరెడ్డి తెలిపారు.