నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం: మార్కాపురం జిల్లా కేంద్రంలో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి 10 గంటల వరకు కరెంటు ఉండదన్నారు. పట్టణంలోని ఎస్వీకేపీ కాలేజీ రోడ్డు, జవహర్ నగర్ కాలనీ, ఏపీజీబీ ఏరియా, తూర్పు వీధి, బోడపాడు రోడ్డు తదితర ప్రాంతాలలో సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.