పదవి ముగిసిన వైసీపీ సర్పంచులకు సన్మానం
ఎన్టీఆర్: విస్సన్నపేట వైసీపీ కార్యాలయంలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో వారిని శాలువాలతో బుధవారం సత్కరించారు. ముఖ్యఅతిధిగా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ పాల్గొని మాట్లాడారు. 'ఈ 5 సంవత్సరాలు వైసీపీ పార్టీకి, ప్రజలకు సేవలు అందించారు. కష్టం వచ్చిన నష్టం వచ్చిన కేసులు పెట్టిన అన్ని భరించారు. పదవి ఉన్న లేకున్నా మీ సేవలు పార్టీకి అవసరం' అని తెలిపారు.