వైభవంగా గట్టు మల్లన్న స్వామి కళ్యాణం

వైభవంగా గట్టు మల్లన్న స్వామి కళ్యాణం

KNR: ఇల్లందకుంట మండలం మల్లన్నపల్లి-రాచపల్లి గ్రామాల వద్ద ఉన్న గట్టు మల్లికార్జున స్వామి దేవాలయంలో మల్లన్న పట్నాలు, కళ్యాణ మహోత్సవం, అగ్నిగుండాల కార్య క్రమాలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఒగ్గు పూజారులు స్వామి వారి ఘనంగా కళ్యాణం జరిపించారు. సుమారు 200 మంది భక్తులు అగ్ని ప్రవేశం చేసి వారి మొక్కులు తీర్చుకున్నారు.