కాటమయ్య రక్షణ పరికరాలపై అవగాహన

కాటమయ్య రక్షణ పరికరాలపై అవగాహన

KNR: వీణవంక మండల కేంద్రంలో ఎక్సైజ్ ఎస్సై సౌమ్య ఆధ్వర్యంలో గౌడ కులస్తులకు కాటమయ్య రక్షణ పరికరాలపై అవగాహన సదస్సు నిర్వహించి, సేఫ్టీ పరికరాలు ఉచితంగా అందించారు. గౌడ కులస్తులు వృత్తిలో భాగంగా నిత్యం తాటి చెట్లు ఎక్కే క్రమంలో ప్రమాదాలు సంభవిస్తుండటం వల్ల వాటిని నివారించడానికి ఈ రక్షణ పరికరాలను విధిగా వాడాలని ఆమె సూచించారు.