తోట్లవల్లూరులో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

కృష్ణా: తోట్లవల్లూరులో తటుకూరి రమణ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, గౌడ కార్పొరేషన్ ఛైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ, అమర వీరులకు నివాళులు అర్పించారు. కార్యక్రమానికి స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.