సీపీఎం జిల్లా కార్యదర్శి గృహ నిర్భందం

NZB: అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యే ముట్టడి ప్రకటించడంతో సీపీఎం, సీఐటీయూ నాయకులు, కార్యకర్తలను సోమవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబును అంగన్వాడీల ఆందోళన నేపథ్యంలో ఉదయం 4 గంటల నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. మూడో టౌన్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధం చేశారు.