కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్, ఉప సర్పంచ్

కాంగ్రెస్‌లో చేరిన సర్పంచ్, ఉప సర్పంచ్

NRPT: నర్వ మండలం కల్వాల గ్రామ సర్పంచ్ చెన్నప్ప, ఉపసర్పంచ్ యాదమ్మ కురుమూర్తి, పలువురు వార్డు సభ్యులు మంత్రి వాకిటి శ్రీహరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. మండల అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, డీసీసీ నేత శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.