'SMAT'లో రోహిత్, జైస్వాల్..?

'SMAT'లో రోహిత్, జైస్వాల్..?

సౌతాఫ్రికాతో మూడో వన్డేలో సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 'సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ'లో ముంబై తరఫున అతడు బరిలోకి దిగబోతున్నాడు. ఈ టోర్నీలో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కూడా ఆడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైకి ఆడుతున్న సూర్యకుమార్, శివమ్ దూబే SAతో T20 సిరీస్ కోసం జట్టును వీడారు. దీంతో వారి స్థానంలో రోహిత్, జైస్వాల్ ముంబై జట్టులో చేరవచ్చు.