జాతీయ రహదారిపై రెండు రోడ్డు ప్రమాదాలు

జాతీయ రహదారిపై రెండు రోడ్డు ప్రమాదాలు

BPT: చీరాల, కారంచేడు జాతీయ రహదారిపై ఆదివారం రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ మహిళతో సహా ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కొర్రపాటి వెంకటేశ్వర్లు(46) మృతి చెందగా, బొలెరో ఢీకొన్న ఘటనలో హబియా(45) అనే మహిళ మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.