బొబ్బిలిలో విస్తృతంగా వాహన తనిఖీలు

బొబ్బిలిలో విస్తృతంగా వాహన తనిఖీలు

PPM: బొబ్బిలి పట్టణంలో శనివారం డీఎస్పీ భవ్యరెడ్డి సమక్షంలో వాహన తనిఖీలు చేశారు. సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎసై, కానిస్టేబుళ్లతో అన్ని కూడళ్లలో 1,388 వాహనాలు తనిఖీ చేశారు. ఇందులో భాగంగా 3 మద్యం తాగి నడిపిన వాహనాలను, రెండు మైనర్ డ్రైవింగ్ వాహనాలను సీజ్ చేశారు. వాహనాలపై పెండింగ్ ఉన్న 79 చలానాలను కట్టించి, కొత్తగా 90 వాహనాలపై ఫైన్స్ వేశారు.