రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

ADB: నార్నూర్ మండలంలోని మహాగావ్ గోండుగూడలో ఇటీవల రూ. 10 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం సర్పంచ్ మెస్రం భీంబాయి మాణికరావు ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థులకు రోడ్డు, నీటి, విద్యుత్తు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.