యుద్ధం.. కేంద్రంపై శశిథరూర్ మండిపాటు

యుద్ధం.. కేంద్రంపై శశిథరూర్ మండిపాటు

అమెరికా-ఇరాన్ యుద్ధంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు పాక్ మధ్యవర్తిత్వం వహించటం భారత్‌కు అవమానకరమని పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడానికి భారత్ శాంతిదూతగా వ్యవహిస్తుందని భావించామని.. కానీ క్రెడిట్ అంతా పాక్‌కు వెళ్తుంటే బాధగా ఉందని చెప్పారు. కేంద్రం తనకున్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు.